calender_icon.png 28 September, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి ఆలయానికి తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్

27-09-2025 11:20:46 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): అంతర్జాతీయ పర్యాటక దినోత్సవములలో భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ (Telangana Tourisam Excellence Award) కు తొలి పుణ్యక్షేత్రముగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఎంపిక కాబడినది.

తేది 27.09.2025 శనివారము సా.గం 6-00లకు సంప్రదాయవేదిక శిల్పారామము నందు తెలంగాణ గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కార్యనిర్వహణాధికారి జి. రవి, ఐఎఎస్, ఎఇఓలు జూశెట్టి కృష్ణ, గజవెల్లి రఘు వారలు ఇట్టి అవార్డును అందుకొనియున్నారు. ఇట్టి అవార్డుకు ఈ క్షేత్రమునకు ఎంపిక చేసినందుకు తెలంగాణ టూరిజం శాఖ వారికి ధన్యవాదములు తెలుపుతూ, ఇట్టి అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమని executive officer జి.రవి IAS తెలియజేసారు మరియు యావత్ దేవస్థాన సిబ్బంది తమ సంతోషాన్ని వ్యక్తపరచారు.