calender_icon.png 13 August, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యశోదే మంత్రం! శ్రీకృష్ణుడే భగవంతుడు!!

01-01-2025 12:00:00 AM

అన్నదమ్ములను విడదీసే రాక్షసులు మనుషుల్లో విభేదాలు సష్టించి విభజించి పాలించే దుష్ట పాలకులు పిల్లలను ఎత్తుకునిపోయే కంసులవంటి రాక్షసులు ఎక్కువై పోతున్న సమాజంలో భయం యశోదానందులకూ ఉందని వివరిస్తున్నదీ పాశురం.

నందగోపుడు గురువు, యశోదే మంత్రం, శ్రీకృష్ణుడే భగవంతుడు. విష్ణువుకు పానుపై, శ్రీరామునికి లక్ష్మణుడై, శ్రీకృష్ణుడికి అన్నయై పక్కతోడుగా ఉన్న బలరాముడే భాగవతుడని ఈ పాశురం సారాంశం.  అడుగడుగునా మానవత్వపు సుగంధాలు విరజిమ్మే కావ్యం తిరుప్పావై.

అమ్బరమే= వస్త్రములు, తణ్ణీరే= చల్లని నీరు, శోఱే= అన్నం, అఱం= ధర్మం, శెయ్యుం= చేయునట్టి ఎమ్బెరుమాన్= మా స్వామీ, నందగోపాలా!= నంద గోపాల నాయకుడా, ఎరుందిరాయ్= లేవయ్యా, కొన్బనార్కు ఎల్లాం= ప్రబ్బలి మొక్కవలె ఉన్న స్త్రీలందరికీ, కొళుందే!= చిగురువలె నుండే దానా, కుల విళక్కే= కులదీపమువంటి దానా,

ఎమ్బెరుమాట్టి= మా స్వామినీ, యశోదా!= యశోదమ్మ తల్లీ, అఱివుఱాయ్= నిదుర లేవమ్మా, అమ్బరం= ఆకాశాన్ని, ఊడఱుత్తు= మధ్యగా భేదించి, ఓంగి= పెరిగి, ఉలగ= లోకా, అళంద= లిచిన, ఉమ్బర్ కోమానే!= నిత్యసూరులకు రాజయినవాడా, ఉఱంగాదు-= నిదురించరాదు, ఎరుందిరాయ్ = మేల్కొనుము. శెమ్ పోల్ కళల్= ఎర్రని బంగారంతో చేసిన కడియ ధరించిన, అడి= పాదముగల,

చ్చెల్వా బలదేవా!= బలరాము డా, ఉమ్బియుం= నీ తమ్ముడును, నీయుం= నీవును, ఉఱంగ్-ఏల్= మేల్కొనండి. గురు పరంపరా ధ్యానంతో ఆచార్యకులం చేరే అర్హ త లభించింది, అదే నందగోపుని భవనం. ఆచార్యుని ఆశ్రయించాలంటే అంతకు ముం దు అహంకారాన్ని వదులుకోవాలి. దానికి శమదమాలు ఉండాలి. ద్వారపాలకులను బతిమాలడంలో తమ బుధ్దిని అహంకార రహిత స్థితిని సూచించారు.

నందుని మేల్కొల్పడం ఆచార్య సమాశ్రయణం, యశోదను మేల్కొల్పడం తిరుమంత్రాన్ని సాధించడం, శ్రీకృష్ణుని మేల్కొల్పడం భగవంతుడు సాక్షాత్కరించడమే, బలరాముడిని నిద్ర లేపడ మంటే భాగవతులను ఆశ్రయించడం.

నందగోపాలుడు వ్రేపల్లెలో జనప్రియమైన నాయకుడు. వస్త్రాలు కావలసిన వాడికి వస్త్రాలు, త్రాగునీరు కావలసిన వారికి త్రాగునీరు, అన్నం అడిగేవారికి అన్నం ధర్మబుద్ధి తో, ప్రతిఫలాక్ష లేకుండా ఇచ్చే ఉత్తముడు నందగోపుడు. అటువంటి మా స్వామీ మేలుకోవయ్యా అని శుభోదయం పలుకుతు న్నారు. యశోద సుకుమారమైంది.

ప్రబ్బలి చెట్టువలె సున్నితమైన మహిళలల్లోకెల్లా చిగు రు వంటిది. యదువంశానికి కులదీపం. మా యజమాని, స్వామిని, యశోదా లేపమ్మా. ఆకాశాన్ని రెండుగా చీల్చుకుంటూ మధ్యలో ఎదిగిన వాడా, నిత్యసూరులకు రారాజా, త్రివిక్రముడైన శ్రీకృష్ణమూర్తీ లేవయ్యా. ‘స్వచ్ఛమైన ఎఱ్రని బంగారంతో చేసిన కడియా న్ని ధరించిన బలదేవా, నీవూ నీ తమ్ముడూ ఇద్దరూ లేవండి’ అని గోపికలు మేలుకొలుపులు పాడుతున్నారు.

ప్రబ్బలి చెట్టు నీటి ఒడ్డున ఉంటుంది. నీటి వేగం ఎక్కువైతే వంగిపోతుంది. నీరు వెడలిపోయిన తరువాత లేచి నిలుస్తుంది. సహజంగా మార్దవమైందీ, ప్రియుని అనుసరించడంలో నేర్పుగల స్త్రీని ప్రబ్బలి చెట్టుతో పోలుస్తున్నారు గోదమ్మ. అటువంటి స్త్రీ జాతికి చిగురు అంటే శ్రేష్టమైం ది యశోద.

శ్రీ=లక్ష్మీదేవి స్వామిని, శ్రియఃపతి స్వామి. నంద యశోదలు తమకు సర్వేశ్వరుని అందించే వారు గనుక వీరినే స్వామినీ, స్వామి అని సంబోధిస్తున్నారు. యశోద మంత్రం మంత్రం వలె భగవానుని గర్భంలో నిమిడ్చికొని కాపాడునది. ఆశ్రితులకు తప్ప ఇతరులకు కనబడకుండా కుమారుడిని కాపాడుతున్నది యశోద.