calender_icon.png 12 October, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిమ్ సెంటర్లో వ్యక్తిపై మూకుమ్మడి దాడి.!

11-10-2025 12:07:03 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న జిమ్ సెంటర్‌లో ఓ యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువకుడు(32) గగ్గలపల్లి ప్రాంతంలోని సోలార్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తూ శారీరక ఆరోగ్యం కోసం పోలీస్ స్టేషన్ ముందు ఉన్న జిమ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. శుక్రవారం జిమ్ చేస్తున్న క్రమంలో యువకుడి చేతి పక్కనే ఉన్న మరో యువకుడి చేతికి అనుకోకుండా తగలడంతో మాటమాట పెరిగి గొడవకు దారితీసింది.

ఈ క్రమంలో గంజాయి బ్యాచ్ గా పేరు మోసిన కొంతమంది గ్యాంగ్ వచ్చి ఆ యువకుడ్ని చితకబాదారు. ఎడమకన్ను పైభాగంలో తీవ్ర రక్త గాయాలు కావడంతో జిమ్ నిర్వాహకులు తోటి జిమ్ చేసే యువకులు ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జిమ్ములోనే గంజాయి బ్యాచ్ గా పేరు మోసిన గ్యాంగ్ ఒకేసారి జిమ్ సెంటర్ లోకి చొరబడి అందులోని వ్యక్తిని గాయపరచడంతో స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

గత కొంతకాలంగా పట్టణంలో గ్యాంగ్ వార్ తరచూ జరుగుతున్నాయని సిసి ఫుటేజ్ వీడియోలు బయటపడుతున్న క్రమంలోనూ పోలీస్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు మరింత పెరుగుతున్నాయని సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం గాయపడిన వ్యక్తిఫై కొందరు రాజకీయ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.