calender_icon.png 18 May, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తుకు మీ అడుగులే పునాది

16-05-2025 12:34:53 AM

  1. ఎమ్మెల్యేగా గెలిచిన కంటే ఈరోజు సంతోషంగా ఉంది 

ప్రోత్సహం చిన్నదే మీరు అందించిన విజయం చాలా గొప్పది 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, మే 15 (విజయ క్రాంతి) :  భవిష్యత్తుత్రానికి మార్గ నిర్దేశకులుగా మీరు ఎలుగుతారని సంకల్పంతో మీరు వేసే ప్రతి అడుగు పునాది అవుతుందనిమహబూబ్ నగర్ ఎ మ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎఫ్సెట్‌bఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఉచిత ప్రత్యేక కోచింగ్  అందించారు.   

ఉచిత  కోచింగ్ తీసుకుని, ఉత్తమ ర్యాంకులు సాధించిన 114 మంది విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే గారు మా ట్లాడుతూ సంవత్సర కాలం పాటు నేను కన్న కలలు ఫలించాయని, ప్రభుత్వ కళాశాలల్లో చ దువుతున్న విద్యార్థులు కార్పోరేట్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులతో పోటీ పడి మంచి ర్యాంకులు సాధించారని, ఇంతకుమించిన ఆనందం ఏమి ఉంటుందన్నారు. 

ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.  విద్యార్థులు ఈ ర్యాం కులు సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన చెప్పారు.  తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంతోషం కంటే కూడా ఈ రోజు 114 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినందుకు తనకు కలిగిన సంతోషం ఎక్కువ అని ఆయన చెప్పారు.

ఉచిత కోచింగ్ తీసుకుని ఈ రోజు ఉత్తమ ర్యాంకులు సాధించిన ఘనత విద్యార్థులతో పాటు అందరి  సమిష్టి కృషి  అని ఆయన తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ ర్యాంకులు తో వారి తల్లిదండ్రుల గుండెల్లో సంతోషం నింపినారని,   వారికి మరింత ప్రోత్సా హం ఇస్తే,  ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆయన చెప్పారు.   మహబూబ్ నగర్ లో మంచి మార్పు మొదలైందని, ఈ మార్పు ఇలాగే కొనసాగించాలన్నారు. మన  పాలమూరు యూ నివర్సిటీ లో ప్రారంభం కానున్న నూతన ఇంజనీరింగ్ కాలేజీలో మన మహబూబ్ నగర్ బిడ్డలు చదువాలన్నది తన ఆశయం అని ఆయన చెప్పారు.  

 అంతకుముందు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి  మాట్లాడుతూ విద్య ఒక్కటే శాశ్వతమైనది అని తెలిసిన వ్యక్తి మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు,  అందుకే  ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న నిరుపేద పేద విద్యార్థులకు మం చి భవిష్యత్తు అందించాలనే సంకల్పం తోటి ఉచితంగా ఎప్సెట్ లో కోచింగ్ ఇప్పించారని   ఎమ్మెల్యే అందించిన ప్రోత్సాహం తో విద్యార్థులు నేడు మంచి ర్యాంకులు సాధించారని, ఇది మన మహబూబ్ నగర్ విద్యా వ్యవస్థకు ఎంతో శుభపరిణామం అని అన్నారు. 

ఎమ్మెల్యే గారి కృషి తో మనకు ఐఐఐటి కళాశాల కూడా రాబోతుందని కలెక్టర్ గారు చెప్పారు.  ఇలాంటి ఎ మ్మెల్యే మనకు ఉండడం మన అదృష్టం అని ఆమె అన్నారు.  అనంతరం విశిష్ట అతిథిగా హాజ రైన పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మె ల్యే గారు విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని,  ఈ ఫలితాలు ఎమ్మెల్యే గారికి మరింత బలాన్ని ఇస్తాయని అన్నారు. 

విద్యార్థులు సాధించిన ర్యాంకు లతో రాష్ట్రంలోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వస్తుందని,  మంచి కోర్సులు ఎంచుకొని మీరు జీవితంలో స్థిరపడాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గారు విద్యార్థులను ఘనంగా సన్మానించారు.   

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేం దిర బోయి, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధు సూదన్ రెడ్డి,టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, టి పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి,

ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కౌసర్ జహాన్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతా చారి, జేపిఎన్సీఈ   రవికుమార్,  రిషి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య, ప్రతిభ జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.