19-09-2025 12:19:03 AM
జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెంపర్ణిక రెడ్డి
నారాయణపేట.సెప్టెంబర్,17(విజయక్రాంతి) : నేటి యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వే సేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా పనిచేయాలని మరియు నారాయణపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా మార్చేందుకు మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగ స్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ , స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి లు తెలిపారు.
గురువారం ఉదయం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం విద్యార్థి సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రం లో విద్యార్థులతో విద్యార్థి మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జి ల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ , స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి లు ముఖ్య అతిథులుగా హా జరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ...
యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఈ అలవాటు వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు కుటుంబం, సమా జం మొత్తాన్ని దెబ్బతీస్తుందని యువత భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా పోరా డాలని పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యా ప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందని, తల్లిదండ్రుల తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఎవరైనా డ్ర గ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసుల కు లేదా డయల్ 100 కి లేదా 1908 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కట్టిన చర్యలు తీసుకో వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ గంజాయి వంటి వాటికి దూరంగా ఉండి నా రాయణపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా మార్చేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఎస్పీ కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై కఠినంగా పనిచేస్తుందని, చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించడమే ముఖ్య లక్ష్యం అని, ఇలాంటి విద్యార్థి ర్యాలీలు సమాజంలో మార్పు తీసుకొస్తాయని పేర్కొన్నారు. గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఇది కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కా దు మీ కుటుంబాన్ని మీ కలలను కూడా నాశనం చేస్తుందని తెలిపారు.
కావున ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు అందరు పాటుపడాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సంద ర్భంగా తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ అవగాహన కో సం విద్యార్థులు డ్రగ్స్ మానుకోవడం పై రూపొందించిన పోస్టర్లు ప్లకార్డులు నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కా ర్యక్రమంలో సిఐ శివ శంకర్, ఎక్సైజ్ సీఐ అనంతయ్య,ఎస్‌ఐ రాముడు, ఎక్సైజ్ ఎస్‌ఐలు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థి సేన ఆర్గనైజేషన్ వారు, విద్యార్థులుపాల్గొన్నారు.