నాన్నా చాలా టెన్షన్ వచ్చింది
తండ్రితో ఆర్యవీర్ సెహ్వాగ్
న్యూఢిల్లీ, నవంబర్ 15: అండర్-19 ఆసి యా కప్(Under-19 Asia Cup) 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ 1 వికెట్ తేడాతో గెలుపొందింది. ఈ ఉత్కంఠ పోరు తర్వాత యువ క్రికెటర్ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌తో మా ట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మస్కట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారుడితో మాట్లాడి అభినందించాడు.
మ్యాచ్ చివరి ఓవర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పుడు ఒత్తిడిని అధిగమించడానికి తాను నిరంతరం సీతారాం అని జపిస్తూ కూర్చున్నాననిఆర్యవీర్ తన తండ్రి తో పంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన మోచేతికి గాయమైందని, ఫిజి యో వచ్చి రెండుసార్లు పరీక్షించారని ఆర్యవీర్ తెలిపాడు.
ఆ సమయంలో స్టేడియంలో ఉన్న సుమారు రెండు వేల మంది పాకిస్థానీ అభిమానులు సెహ్వాగ్, సెహ్వాగ్ అంటూ ని నాదాలు వినిపించిన విషయాన్ని కూడా తండ్రితో చెప్పాడు. కుమారుడి ఘనతపై వీరేంద్ర సెహ్వాగ్ భావోద్వేగానికి లోనయ్యా డు. ఇలాంటి ప్రత్యేకమైన క్షణాలు అవార్డు లు, పరుగులు, ట్రోఫీల కంటే చాలా గొప్పవని, తండ్రిగా ఈ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని సెహ్వాగ్ తెలిపాడు.
ఈ విజయాన్ని తలకెక్కించుకోకుండా మరింత ఎత్తుకు ఎదగాలని సూచించాడు. ఎల్లప్పు డూ వినయంగా ఉండాలని కొడుకును ఆశీర్వదిస్తూ సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. టోర్నీ ఆద్యం తం నిలకడగా రాణించిన ఆర్యవీర్ 5 మ్యా చ్లలో 90.25 సగటుతో 361 పరుగులు చేసి ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు.
ఇదిలా ఉంటే అండర్ 19 ఏషియా కప్ 2026 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచినప్పటికీ ఆర్యవీర్ సెహ్వాగ్, ఐసీసీ అండర్ 19 వరల్ కప్ 2028 టోర్నీ ఆడలేడు. దీనికి కారణం అతని వయసు. ప్రస్తు తం 19 ఏళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్, 2028 నాటికి 20 ఏళ్లకు చేరుకుంటాడు. దీంతో అండర్ 19 వరల్ కప్ 2028 ఆడేందుకు అవసరమైన గరిష్ట వయసు అర్హతను దాటేస్తాడు.19 ఏళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్, ఐపీఎల్ 2027 మినీ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది.