రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలుపు
అడిలైడ్, నవంబర్ 15: ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లాండ్(England) మధ్య వన్డే సిరీస్(ODI series) ఆసక్తిరంగా సాగుతోంది. తొలి వన్డేలో ఆసీస్ గెలిస్తే, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అడిలైడ్‌ఓవల్ వేదికగా ఆదివారం జరిగినరెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాం డ్ 135 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాం డ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 355 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక వన్డే స్కోరు. ఇంగ్లాండ్ ఓపెనర్ టామ్ బాంటన్ 99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు చేసి జట్టు భారీ స్కో రుకు పునాది వేశాడు. జో రూట్ (62), జో ర్డాన్ కాక్స్ (67), విల్ జాక్స్ (54) అర్ధ సెంచరీలతో రాణించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో జేవియర్ బార్ట్‌లెట్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 44.3 ఓవర్లలో 220 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తర ఫున కామెరూన్ గ్రీన్ (64), మాట్ రెన్షా (63) అర్ధ సెంచరీలతో పోరాడినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఇం గ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 10 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. లియామ్ డాసన్, సామ్ కరన్ రెండే సి వికెట్లు తీశారు. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డే బుధవారం హోబ ర్ట్‌లో జరుగుతుంది.