భారత్‌లో 2031 వన్డే ప్రపంచకప్
బాలి, నవంబర్ 15: భారత్ మరో మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. 2031 ఐసీసీ వన్డే ప్రపంచకప్(ICC Mens Cricket World Cup) భారత్ వేదికగా జరగనుంది. 2027 నుంచి 2035 వరకూ పలు ఐసీసీ టోర్నీలకు సంబంధించిన ఆతిథ్య దేశాలను ఐసీసీ ఖరారు చేసింది. ఈ సైకిల్ లో 2031 పురుషుల వన్డే ప్రపంచకప్‌ను భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఈ మెగా టోర్నీ 2031 అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు జరగనుందని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది ఐదోసారి కానుంది. గతంలో 1987, 1996, 2011 మరియు 2023 ప్రపంచకప్ మ్యాచ్ లకు భారత్ వేదికైంది. 2031 వన్డే ప్రపంచకప్ కంటే ముందు, 2029 ఐసీసీ ఛాంపి యన్స్ ట్రోఫీకి కూడా భారత్ ఒంటరిగా ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి. కాగా 2027 సౌతాఫ్రికా వన్డే ప్రపంచకప్ తర్వాత ప్రారంభమయ్యే ఈ విండోలో భాగంగా.. 2035 నాటికి నాలుగు టీ20 ప్రపంచకప్‌లు, రెండు చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలతో పాటు పలు ఐసీసీ ఈవెంట్లను నిర్వహించేందుకు క్యాలెండర్‌ను విడుదల చేసింది.