లక్ష్యసేన్‌దే కుమామోటో మాస్టర్స్

16-11-2026 | 05:15am
  1. చరిత్ర సృష్టించిన భారత షట్లర్
  2. సీజన్‌లో రెండో టైటిల్ కైవసం

టోక్యో, నవంబర్ 15: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్(Indian star shuttler Lakshya Sen) చరిత్ర సృష్టించాడు. జపాన్ వేదికగా జరిగిన కుమామోటో మాస్టర్స్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నవంబర్ 15, 2026న జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో స్థానిక ఆటగాడు కోకి వతనాబేపై 13- 21- 21 తేడా తో అద్భుత విజయం సాధించాడు.

ఒక గంట నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 13 కోల్పోయినప్పటికీ, లక్ష్యసేన్ ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకున్నాడు. మూడో గేమ్‌లో 5-5 వద్ద సమంగా ఉన్న దశలో లక్ష్యసేన్ తన దూకుడు పెంచి 1 ఆధిక్యంలోకి వెళ్లాడు. అక్కడి నుంచి ప్రత్యర్థి కి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా 21 గేమ్‌తో పాటు టైటిల్‌ను కైవసం చేసు కున్నాడు దీంతో కుమామోటో మాస్టర్స్ టైటిల్ గెలిచిన మొదటి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు.

ఇటీవల హైలో ఓపెన్ గెలిచిన తర్వాత, లక్ష్యసేన్‌కు ఇది వరుసగా రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్. తన కెరీర్లో ఒకే సీజన్‌లో రెండు వరల్డ్ టూర్ టైటిళ్లు గెలవడం లక్ష్యసేన్‌కు ఇదే తొలిసారి. అతని కెరీర్‌లో మొత్తంగా ఆరో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్. ఈ విజయంతో లక్ష్యసేన్‌కు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. దీని ద్వారా అతను బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ అర్హత పట్టికలో ఆరో స్థానానికి చేరుకునే అవకాశం ఏర్పడింది.


మరిన్ని వార్తలు