మద్దిరాలలో పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్

16-11-2026 | 05:30am

సరైన పత్రాలు లేని ద్విచక్ర   వాహనాలు సీజ్.

తుంగతుర్తి (మద్దిరాల), నవంబర్ 15 : జిల్లాలోని మద్దిరాల గ్రామంలో శనివారం రాత్రి పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(Police Cordon and Search Operation) నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోకి వచ్చే పోయే అన్ని మార్గాలను పోలీసు అధీనంలో ఉంచి, గ్రామంలో ప్రతి ఇల్లు తనిఖీ చేసి, భద్రత అంశాలు పర్యవేక్షణ చేశారు.

అనుమానితుల గురించి తనిఖీ చేసి ఫింగర్ ప్రింట్ డివైన్ తో వెలి ముద్రలను పరిశీలించారు. సరైన అనుమతి పత్రాలు లేని .... ద్విచక్ర వాహనాలు, కార్లు సీజ్ చేశా రు. ఈ సందర్భంగా డిఎస్పి ప్రసన్నకుమార్ స్థానిక గ్రామ ప్రజలతో మాట్లాడి, సామాజిక అంశాల పట్ల భద్రత పరమైన చర్యల పట్ల, అవగాహన కల్పించారు. వాహనాలకు అనుమతి పత్రాలు, నంబర్ ప్లేట్స్ లేకపోతే నేరాలు ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తింపు కష్టమవుతుందని పోలీసు దర్యాప్తు ఇబ్బంది అవుతుందని.

ప్రజల భద్రత కోసం రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉం టామని శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారంతో ఆధునిక పోలీసింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. నేరాల నివారణలో ప్రజ లు పోలీస్ తో భాగస్వామ్యం కావాలని గ్రా మాలలో ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

యువత ఆదర్శంగా ఉండాలని అన్నారు. కొత్త వారికి ఆశ్రయం ఇవ్వకూడదని అన్నా రు. అనుమానం కలిగేలా ఎవరైనా వ్యక్తులు తారసపడిన అనుమానిత వ్యాపారాలు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని 112 కు తెలియజేయాలని తెలిపారు. యువ త వ్యసనాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ లాంటివి మన గ్రామంలో రాకుండా భావితరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం దరిపైందని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న విన్నమవుతున్నాయని ప్రయాణ సమయంలో ముంద స్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించాలని తెలిపారు. సైబర్ మోసాల వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందని, అత్యాశకు పోయి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు తెలియజేయడం వల్ల సైబర్ మోసాలకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఉపేందర్ రావు ఎస్త్స్రలు క్రాంతి కుమార్, వీరన్న, 80 మంది పోలీస్ బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు