గ్రామ పంచాయతీ కార్మికురాలు కుటుంబాన్ని ఆదుకోవాలి
డిపిఓ కి వినతిపత్రం అందించిన సి ఐ టి యు
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి):ఈ నెల 12 వ తేదీన విధుల్లో ఉన్న గ్రామ పంచాయతి కార్మికురాలు(Gram Panchayat worker) గాయపడి ఎడమ చేయి తొలగించిన కారణంగా ఆ కురుంబాన్ని ఆదుకోవాలని డీపీవో అనూష కి సిఐటీయు ప్రతినిధి బృందం వినతిపత్రం అందించారు.
ఈ సందర్బంగా CITU జిల్లా కార్యదర్శి ఎజె రమేష్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన విధుల్లో ఉండగా వ్యాన్ ఢీ కొట్టి కిందపడిన కారణంగా ఎడమ చేయి నుజ్జు లుజ్జయిందని,దీనితో భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేసి తమ చేతిని తొలగించడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పోస్టల్ ఇన్సూరెన్స్ కట్టించినప్పటికీ దానిని రెన్యువల్ చేయని కారణంగా తీవ్రంగా గాయపడి ఎడమ చేయి కోల్పోయిన కార్మికురాలికి నయా పైసా కూడా నష్టపరిహారం వచ్చే అవకాశం లేనందున తక్షణమే గ్రామపంచాయతీ బాధ్యత తీసుకొని రూ 10 లక్షల నష్టపరిహారం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి అనూష కి విజ్ఞప్తి చేశారు. మొత్తం కార్మికులందరికి తక్షణమే పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించాలని, కార్మికులకు మూడు సంవత్సరాలుగా యూనిఫామ్ ఇవ్వలేదని చెప్పులు,
కొబ్బరినూనె, సబ్బులు ఇవ్వాలని, ఆదాయం ఉన్న పంచాయతీగా ఉన్నందున కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు. కార్మికులందరికీ PF, ESI సౌకర్యం కల్పించాలని, ఆదివారం,పండగ సెలవులు అమలు చేయాలని కోరగా ఇందుకుగాను డిపిఓ అనూష మాట్లాడుతూ భద్రాచలంలో జరిగిన ఘటన తన నోటీస్ కి రాలేదని వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
డిపిఒ ని కలిసిన బృందంలో సిఐటి జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్, ఉపాధ్యక్షులు దొడ్డా రవికుమార్ ఉన్నారు.