టి.జి.ఎస్.పి నుంచి ఏ.ఆర్ విభాగానికి 10 మంది కానిస్టేబుళ్ల కన్వర్షన్
కన్వర్షన్ పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
బోధన్, నవంబర్ 16 (విజయ క్రాంతి): తెలంగాణ స్పెషల్ పోలీస్(Telangana Special Police) (టి.జి.ఎస్.పి) నుంచి ఆర్ముడ్ రిజర్వ్ (ఏ.ఆర్) విభాగానికి కన్వర్షన్ పొందిన 2013 బ్యాచ్‌కు చెందిన 10 మంది కానిస్టేబుళ్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన 2013 బ్యాచ్ కానిస్టేబుళ్లలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన 10 మందికి ఏ.ఆర్ విభాగంలోకి కన్వర్షన్ లభించింది. ఈ సందర్భంగా కన్వర్షన్ పొందిన సిబ్బంది సోమవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
గత కొంతకాలంగా ఏ.ఆర్ విభాగానికి కన్వర్షన్ కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు అవకాశం లభించడంతో వారిలో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వారికి శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో విధులను అంకితభావంతో నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కన్వర్షన్ పొందిన కానిస్టేబుళ్ల వివరాలు:
1. ఎం. వెంకటేష్ – పీసీ 1529
2. ఆర్. అమర్ సింగ్ – పీసీ 364
3. ఎం. రామచంద్ర – పీసీ 1528
4. సీహెచ్. మహేందర్ – పీసీ 1530
5. కే. రవి – పీసీ 332
6. జి. శ్రీను – పీసీ 443
7. రాజేష్ – పీసీ 540
8. గణపతి – పీసీ 659
9. శ్రీను – పీసీ 611
10. అర్జున్ – పీసీ 875
టి.జి.ఎస్.పి నుంచి ఏ.ఆర్ విభాగానికి కన్వర్షన్ పొందిన సిబ్బంది పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.