ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులతో ఉపాధి అవకాశాలు
తంగళ్లపల్లి, నవంబర్ 16 (విజయ్ క్రాంతి): విద్యార్థినుల్లో సృజనాత్మకత, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్(District Collector Garima Agrawal) సూచించారు. సోమవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తరగతి గదులు, వంటగది, హాజరు రిజిస్టర్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, డిజిటల్ ఇమేజింగ్ కోర్సుల ద్వారా భవిష్యత్తులో లభించే ఉపాధి అవకాశాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాదించాలి.