జర్నలిస్టుల సంక్షేమానికి నెలకు రూ.లక్ష కేటాయిస్తా

16-11-2026 | 11:36pm

జడ్చర్ల : నియోజకవర్గ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రతి నెలా తన ఎమ్మెల్యే జీతం నుంచి రూ.లక్ష కేటాయిస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Janampalli Anirudh Reddy) ప్రకటించారు. జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన జడ్చర్లలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని,

పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు నిజాయితీగా, నిర్భయంగా పనిచేస్తూ ప్రజా సమస్యలు, అవినీతిని వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.

మరిన్ని వార్తలు