ప్రతి కుటుంబానికి భరోసా అందిస్తున్నాం
- మున్సిపాలిటీలో 490, మండలంలో 787 మందికి పింఛన్లు మంజూరు
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
జడ్చర్ల, నవంబర్ 16 : ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించడం జరుగుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Jadcharla MLA Anirudh Reddy) అన్నారు. సోమవారం జడ్చర్లలోని చంద్ర గార్డెన్స్‌లో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో 490, మండల పరిధిలో 787 మందికి నూతన పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. పింఛన్ నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరీష్, ఎంపీడీవో, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.