ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొని వ్యక్తి మృతి...
చించోల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... బైక్‌పై వెళ్తుండగా ఘటన...
బాన్సువాడ, నవంబర్ 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించోల్లి(Chincholla) సమీపంలోని ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) ఒక వ్యక్తి మృతి చెందాడు. రహదారిపై నిలిపి ఉంచిన డీసీఎం వ్యాన్‌ను ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఢీకొనడంతో .
ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఘుడుసాబ్ బీర్కూర్ మండలం చించోల్లి గ్రామంలోని మసీదులో ఇమామ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం నమాజ్ నిర్వహించిన అనంతరం తన సోదరిని కలిసేందుకు ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై బీర్కూర్‌కు వెళ్లాడు.
అక్కడి నుంచి తిరిగి వస్తుండగా చించోల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన డీసీఎం వ్యాన్‌ను బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘుడుసాబ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు బీర్కూర్ ఎస్‌ఐ రాములు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రధాన రహదారులపై వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపి ఉంచరాదని సూచించారు. రహదారులపై వరిధాన్యాన్ని ఆరబెట్టి ప్రమాదాలకు కారణమైతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఒకరి నిర్లక్ష్యం మరొకరి ప్రాణానికి ముప్పు అన్నట్లుగా మారుతున్న రహదారి పరిస్థితులపై వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.