అడవిని పరిరక్షించడంలో భాగస్వాములు కావాలి
16-11-2026 | 10:37pm
తాడ్వాయి,నవంబర్,16( విజయ క్రాంతి): అడవిని సంరక్షించడంలో సర్పంచులు భాగస్వాములు కావాలని అటవీ శాఖ అధికారులు(Forest Department officials) కోరారు. హైదరాబాదులోని దూలపల్లి రాష్ట్ర అటవీ అకాడమీలో(State Forest Academy, Dulapally) సోమవారం సర్పంచ్ లకు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాల సర్పంచులు అడవిని సంరక్షించడంతోపాటు, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని కోరారు. తరలి వెళ్లిన వారిలో సర్పంచులు సంకు పోచయ్య,భాస్కర్ రెడ్డి, బద్రి నాయక్ తదితరులు ఉన్నారు.