గణిత ఒలింపియాడ్‌లో పాల్గొనడం ద్వారా ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చు

16-11-2026 | 10:25pm

కొత్తపల్లి, నవంబర్ 15(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా  కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు(Students of Alforce E-Techno School) అత్యధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ లోని రామచంద్రాపురం కు చెందిన ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ అయిన రామానుజన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు 37వ జాతీయ మ్యాథమెటిక్స్ టాలెంట్ సర్చ్ కాంపిటీషన్లో భాగంగా నిర్వహించినటువంటి  రామానుజన్ గణిత ఒలంపియాడ్ తుది దశకు  41 మంది విద్యార్థులు ఎంపికై,తుది దశ పరీక్ష సైతం ఉత్సాహంగా రాసిన విద్యార్థులు రాయడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ప్రత్యేక సమావేశానికి  ముఖ్యఅతిథిగాఅల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి  హాజరైనారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఒలంపియాడ్ లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలు మెరుగుపడతాయని వారు చెప్పారు. క్లిష్టమైన గణిత సమస్యలను సులభంగా,మరియు  వేగంగా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు