తంగళ్లపల్లిలో 802 మందికి కొత్త పెన్షన్లు మంజూరు
16-11-2026 | 10:31pm
తంగళ్లపల్లి, నవంబర్ 16 (విజయ్ క్రాంతి): అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం చేయూత పెన్షన్లు(Government Support Pensions) మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్(Collector Garima Agarwal) తెలిపారు. సోమవారం బద్దెనపల్లి ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా 8,209 మందికి, తంగళ్లపల్లి మండలంలో 802 మందికి కొత్త పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ నెల 19 తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.