వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన చేయూత పింఛన్ల పంపిణీ(Distribution of 'Cheyutha' pensions) కార్యక్రమం హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మండలంలోని మొత్తం 845 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఇందులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఉన్నారు. అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం పింఛన్లు అందజేస్తోందన్నారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్, ఎంపీ వెంకటేష్, బుద్ధారం సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేందర్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.