ఆధ్యాత్మికత ఐక్యత పెంపొందుతుంది
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్, నవంబర్ 16 (విజయక్రాంతి): మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ అక్షర కాలనీలో(Enugonda Akshara Colony) ఉన్న శ్రీశ్రీశ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గణపతి, ధ్వజస్తంభం, శివాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి, రామాలయం, పోచమ్మ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud ) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన కమిటీ సభ్యులు, కాలనీవాసులను అభినందించారు. ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మాణిక్య ప్రభు, ఉపాధ్యక్షులు కమలాకర్ రాజు, రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి స్వప్న, కోశాధికారి దాసయ్య, కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.