రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృత్యువాత

16-11-2026 | 10:16pm

పాపన్నపేట,నవంబర్16: కారు-బైక్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని యూసఫ్ పేట గ్రామీణ బ్యాంకు(Yusufpeta Rural Bank) వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కుర్తివాడ గ్రామానికి చెందిన సార యేసు(48) సోమవారం రాత్రి మెదక్ నుండి స్వగ్రామానికి బైక్ పై వస్తున్నాడు.

ఈ క్రమంలో పాపన్నపేట వైపు నుండి మెదక్ వెళ్తున్న ఓ కారు యూసుఫ్ పేట్ గ్రామీణ బ్యాంకు వద్ద ఢీకొట్టింది. ఈ సంఘటనలో యేసు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా యేసుకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు