చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
ముకరంపుర, నవంబర్ 16(విజయ క్రాంతి): అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలను(Benefits of welfare schemes) అందించడమే ప్రభుత్వాల లక్ష్యమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో(Collectorate Auditorium) ‘చేయూత’ పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, పాలరవర్గ సభ్యులు, అతిథులుగా హాజరయ్యారు. నగరపాలక సంస్థ పరిదిలోని మొత్తం 66 డివిజన్లలో కొత్తగా ఎంపికైన 3,812 మంది.
లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పెన్షన్ పత్రాలను ఆయా డివిజన్ల పాలకవర్గ సభ్యులతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య తమ చేతుల మీదుగా అందజేశారు.
నగరపాలక సంస్థ కు మెత్తం 6018 దరఖాస్తులు రాగా మొత్తం 3812 పెన్షన్లు మంజూరు కావడం జరిగిందని ఇందులో వితంతువు: 2180, వికలాంగుల:1046, ఒంటరి మహిళా:467, చేనేత: 47, గీతాకార్మీక: 72 చొప్పున రావడం జరిగింది. మరొ 200 దరఖాస్తులు 360 డిగ్రీల మానిటరింగ్ ఎక్వైరీ పూర్తి చేసి... అర్హత జాబితా ఉండటం జరిగింది. చేయూత మంజూరు పత్రాల పంపిణీ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.