జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిగా గోపీచంద్ నాయక్

17-11-2026 | 12:00am

మహబూబాబాద్ (విజయక్రాంతి):జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిగా(District Scheduled Caste Development Officer) (ఇన్‌చార్జి) అజ్మీర గోపీచంద్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ స్నేహా శబరిష్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అధికారికంగా విధుల్లో చేరారు.

రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాకు డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయన, శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కార్యాలయ సిబ్బంది, వసతి గృహాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు