ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

17-11-2026 | 12:05am
  1. భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు.. 
  2. ప్రసాద వితరణ

శివంపేట్ నవంబర్ 16 ( విజయక్రాంతి ): శివంపేట్ మండలం చిన్న గొట్టిముక్కల గ్రామపంచాయతీ పరిధిలోని(Gram Panchayat areas) కార్తీక మాసం సందర్భంగా చాకరిమెట్లలోని స్వయంభూ శ్రీ సహకార ఆంజనేయ స్వామి(Swayambhu Sri Sahakari Anjaneya Swamy) వారి దేవస్థానంలో సోమవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సంప్రదాయబద్ధంగా కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

కార్తీక మాసం విశిష్టతను చాటుతూ భక్తులు దీపారాధనలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు పసుపు, కుంకుమ, తాంబూలంతో పాటు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈఓ సారా శ్రీనివాస్ పర్యవేక్షించగా, ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు, రాజాప్రభూ శర్మ, దత్తు శర్మ,రమేష్ శర్మ . కార్తీక మాసంలో ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు