నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా భజన మండలికి విరాళం

17-11-2026 | 12:09am

ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించిన కుమారుడు శ్రీనివాస్ రెడ్డి

గండీడ్,నవంబర్ 16 విజయక్రాంతి: మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి(Reddypalli village) చెందిన కీర్తిశేషులు ముసలి గారి నరసింహారెడ్డి(Narasimha Reddy) మూడో వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం కుమారుడు, గ్రామ ఉపసర్పంచ్ పారిజాత శ్రీనివాస్ రెడ్డి రూ.11 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామ భజన మండలి ఆధ్వర్యంలో ఈనెల 20న  నిర్వహించే పౌరాణిక పద్య నాటకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ఈ విరాళాన్ని అందించారు. గ్రామంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగించేందుకు సహకారం అందించడంపై భజన మండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పారిజాత శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన. రెడ్డిపల్లి గ్రామ భజన మండలి భక్తులు. తోకల కృష్ణ, సన్డ్రస్ వెంకటరాములు, మాలే తిమ్మన్న గాజుల కేశవ్ కటిక యాదొజి. తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు