ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

16-11-2026 | 08:48pm

మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల రెడ్డి

తుంగతుర్తి( విజయ క్రాంతి): రైతుల సంక్షేమమే(welfare of farmers) లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్, తీగల గిరిధర్ రెడ్డి(Teegala Giridhar Reddy) పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి. సైదులు అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంతోపాటు బండ రామారం,

అన్నారం కొత్తగూడెం నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, బి-గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్, కొనుగోలు కేంద్రం దారులు ప్రవీణ్, మడ్డి కృష్ణమూర్తి, నాగలక్ష్మి, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు