calender_icon.png 11 January, 2026 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_21864785.webp
పట్నాన్ని తలపిస్తున్న మేడారం

11-01-2026

మేడారం, జనవరి 10 (విజయక్రాంతి): మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో మేడారం పట్టణాన్ని తలపిస్తోన్నది. రూ.101 కోట్లతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువయ్యే జాతర గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించారు. మేడారం నలువైపులా నాలుగు లైన్ల రహదారులుగా విస్తరించారు. జంపన్న వాగులో శాశ్వత ప్రాతిపదికన పనులు చేశారు. విద్యుత్, తాగునీరు, మెరుగైన రవాణా, వసతి సౌకర్యం ఏర్పాట్లు చేశారు. జంక్షన్‌లను గిరిజన సంప్రదాయం ఉట్టిపడే విధంగా కళాకృతులు ఏర్పాటుచేసి సుందరీకరిం చారు. దీంతో ములుగు నుంచి మేడారం వరకు తాడ్వాయి, జంగాలపల్లి జంక్షన్ల వద్ద ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా పేరు గడించి, కోట్లాది భక్తులకు ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి సరికొత్త మురిపం సంతరించుకుని.. భక్తజనకోటికి ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు స్వాగతం పలుకనుంది. తరలివచ్చే అశేషజనవాహనిని ఆధ్యాత్మికతతో కనువిందు చేయనుంది.

article_14743250.webp
ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ అరెస్ట్

07-01-2026

హైదరాబాద్: పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆరెంజ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్‌ సునీల్ కుమార్‌ను(Orange Travels MD arrested) జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. అధికారిక వర్గాల ప్రకారం, కంపెనీ రూ.28 కోట్ల జీఎస్టీని ఎగవేసింది. అరెస్టు అనంతరం, తదుపరి న్యాయపరమైన చర్యల కోసం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు(GST intelligence officers) తమ దర్యాప్తులో అతని వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి పెద్ద ఎత్తున పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు. తెలంగాణవ్యాప్తంగా జీఎస్టీ(Goods and Services Tax) ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.

article_61203123.webp
బెజ్జూర్ లో ఆసుపత్రి మంజూరు చేయాలి

05-01-2026

బెజ్జూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు. గత ప్రభుత్వం 30 పడగల ఆసుపత్రి నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారే తప్ప ఆసుపత్రి నిర్మాణం నోచుకోలేదని అన్నారు. ఆసుపత్రిలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన రోగులకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.బెజ్జూర్ సామాజిక ఆసుపత్రి శిథిలావస్థలో ఉందని,నూతన ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కోరారు.

article_59095329.webp
కొండగట్టు అంజన్న సేవలో పవన్‌ కల్యాణ్‌

03-01-2026

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని( Kondagattu Anjaneya Swamy Temple) సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొండగట్టు(Kondagattu) ఆలయం అభివృద్ధి కోసం రూ. 35.19 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేశారు. కొండగట్టులో భక్తుల కోసం టీటీడీ నిధులతో 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ హాల్‌కు పవన్ కళ్యాణ్ భూమిపూజ చేశారు. ఆలయ సందర్శన అనంతరం, పవన్ కళ్యాణ్ నాచుపల్లిలోని ఒక రిసార్ట్‌లో జనసేన పార్టీ కార్యకర్తలను కలిసి, మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

article_67381747.webp
జలాలపై చర్చిద్దామంటే.. ఎందుకు రావడం లేదు?

03-01-2026

హైదరాబాద్: కృష్ణా జలాల్లో తప్పులను కడిగిపారేస్తామన్న సభ్యులు ఏమయ్యారు? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని ఆది శ్రీనివాస్ చుకలంటించారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా తీసుకున్న నిర్ణయాలపై చర్చకు సిద్ధమన్నారు. అన్ని జీవోలపై చర్చించేందుకు సిద్ధమంటే ఎందుకు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎందుకు సభకు రావట్లేదని ప్రభుత్వ విప్ ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాలకు ఇచ్చిన సమయాన్ని బీఆర్ఎస్ వినియోగించుకోలేదని ఆరోపించారు. స్పీకర్ సమయం ఇచ్చినా.. వాకౌట్ చేశారని మండిపడ్డారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ వద్ద సమాధానం లేదని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా బీఆర్ఎస్ పారిపోయిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah) అన్నారు. 2 వారాలు సమావేశాలు నిర్వహించాలన్న బీఆర్ఎస్ ఎందుకు వాకౌట్ చేసింది?, నీటి పారుదల అంశంపై చర్చించకుండా ఎందుకు పారిపోయింది? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం బయటపడుతుందని పారిపోయారని బీర్ల ఐలయ్య ఆరోపించారు.

article_86176343.webp
జోరుగా మద్యం అమ్మకాలు

01-01-2026

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణలో(Telangana) మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని, కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రూ.1,000 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం, గత ఆరు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ. 1,350 కోట్ల విలువైన మద్యం(liquor sales) అమ్ముడుపోయింది. న్యూఇయర్ సందర్భంగా మూడు రోజుల గరిష్ట విక్రయాల కాలంలో, కొత్త సంవత్సరానికి ముందు, ఆ సమయంలో ఉన్న అధిక డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, ఏకంగా 8.30 లక్షల కేసుల మద్యం, 7.78 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ పెరుగుదలకు సుదీర్ఘ వేడుకలు, మద్యం దుకాణాలకు పెరిగిన రద్దీ, పండుగ సందర్భంగా అధికమైన డిమాండ్‌ను కారణాలుగా పేర్కొన్నారు. అమ్మకాలలో ఈ పెరుగుదల ఎక్సైజ్ రాబడి రూపంలో రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ఆదాయాన్ని కూడా సమకూర్చింది. నూతన సంవత్స వేడుకల సమయంలో శాంతిభద్రతలను నిర్ధారించడానికి కఠినమైన పర్యవేక్షణ, అమలు చర్యలు అమలులో ఉన్నాయని అధికారులు తెలిపారు.